athi parishuddhuda

Leave a Comment

అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము – నీకే అర్పించి కీర్తింతును (2)

నీవు నా పక్షమై నను దీవించగా – నీవు నా తోడువై నను నడిపించగా

జీవింతును నీకోసమే ఆశ్రయమైన నా యేసయ్యా (అతి పరిశుద్ధుడా)

1.సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా – ఉన్నతమైన

నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)

ముందెన్నడూ చవిచూడని సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)

నీలోనే దాచావు ఈనాటికై – నీ ఋణం తీరదు ఏనాటికి (2) (అతి పరిశుద్ధుడా)

2.సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని – గడిచిన కాలం

సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)

కృపవెంబడి కృపపొందగా – మారాను మధురముగా నే పొందగా (2)

నాలోన ఏ మంచి చూసావయ్యా – నీప్రేమ చూపితివి నా యేసయ్యా (2) (అతి పరిశుద్ధుడా)

3.సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక – శోధనలెన్నో

ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)

ఉన్నావులె ప్రతిక్షణమునా – కలిసి ఉన్నావులె ప్రతి అడుగున (2)

నీవేగా యేసయ్యా నా ఊపిరి – నీవేగా యేసయ్యా నా కాపరి (2) (అతి పరిశుద్ధుడా)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *